Description
అభినిర్యాణం అంటే ప్రయాణం
ఇది రెండు వేరు వేరు శతాబ్దాలలో సాగే కల్పిత నవల. 21 వ శతాబ్దంలో అభిమన్యు అనే ఫోటోగ్రాఫర్ ఈక్వినాక్స్ రోజున అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో సూర్యాస్తమయం చూసేందుకు స్నేహితులతో కలిసి వెళ్ళేందుకు సిద్ధమవుతాడు. అయితే అక్కడికి చేరుకున్న అభి కొన్ని అనుకోని సంఘటనల వలన ఆ ఆలయంలో దాగున్న నేలమాళిగలు ఇంకా ఆరవ గదిని తెరిచేందుకు అవసరమైన తాళాన్ని వెతికి చేదించే సమస్యలో ఇరుక్కుంటాడు. మరో వైపు 17 వ శతాబ్దంలో “విలియం ఆల్ఫ్రెడ్ రాయ్” అనే చిత్రకారుడు అరేబియన్ మహా సముద్రం ద్వారా భారత దేశంలోని కేరళ రాష్ట్రానికి ప్రవేశిస్తాడు.మన దేశ సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకుంటూ అద్భుతమైన చిత్రాలను గీస్తుంటాడు.అతను అనుకోకుండా అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని విగ్రహ తయారీ విధానం తెలుసుకునేందుకు ప్రయత్నించి, ఊహించని ప్రమాదంలో పడతాడు. ఇటు 21 వ శతాబ్దంలో అభి అటు 17 వ శతాబ్దంలో రాయ్ వారికి వచ్చిన చిక్కులను, ప్రమాదాలను ఎదుర్కుంటూ వారు చేసిన ప్రయాణం ను, మీరు చదివి ఆస్వాదించాలని కోరుచున్నాము.
Reviews
There are no reviews yet.